Wednesday, April 27, 2011

రిజర్వేషన్ల పెంపు అంశంపై 29న మళ్లీ బహిరంగ విచారణ

రిజర్వేషన్ల పెంపు అంశంపై 29న మళ్లీ బహిరంగ విచారణ

bc-logoహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: బీసీ రిజర్వేషన్ల శాతాన్ని పెంచే అంశంలో విజ్ఞాపనలు, సూచ నలు, అభ్యంతరాలు తెలియజేసుకునే వారికి రాష్ర్ట బీసీ కమీషన్‌ మరో అవ కాశం కల్పించింది. ఈ మేరకు ఈ నెల 29న కొత్తపేటలోని బాబూ జగ్జీవవ్‌ రామ్‌ భవన్‌లో కమీషన్‌ బహిరంగ విచారణ నిర్వహించనున్నది. కనుక విజ్ఞాపనలు, సూచనలు, అభ్యంతరాలు తెలియజేసేవారు వ్రాతపూర్వకంగా ఆరు సెట్లను తమ అభిప్రాయాలను ఈ నెల 27వ తేదీలోపు కమిషనర్‌కు అందజేయాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై బీసీ కమీషన్‌ ఈ ఏడాది జనవరి 28న బహిరంగ విచా రణ జరిపింది. అయిప్పటికా మళ్లీ ఇదే అంశపై బహిరంగ విచారణ ఎందుకు జర పాల్సి వచ్చిందనేది బీసీ వర్గాలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వాస్తవానికి రాష్ర్ట బీసీ కమిషన్‌ బహిరంగ విచారణ పూర్తి చేశాక, జాతీయ బీసీ కమీషన్‌ చైర్మన్‌ బీసీ రిజ ర్వేషన్ల పెంపుపై అత్యుత్సాహం వద్దని రాష్ర్ట బీసీ కమీషన్‌కు లేఖ రావారు.
అంతే కాకుండా ఆయన హైదరాబాద్‌ వచ్చిన సందర్భంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అత్యు త్సాహం వద్దని ఇక్కడి బీసీ నాయకులకు కూడా తెలిపారు. బీసీల రిజర్వేషన్లు పెంచితే అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కూడా స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షులు పాలూరు రామకృష్ణయ్య రాష్ర్ట బీసీ కమిషన్‌ చైర్మన్‌ని మార్చి నెలలో ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు 2001లో మల్టీపర్పస్‌ హౌస్‌ హోల్డ్‌ సర్వే ప్రకారం బీసీల జనాభా 43.16 ఉందని ప్రభుత్వం తీసిన గణాంకాలను చూపారు. ఈ సర్వేను సెన్సెస్‌ విభాగం కూడా ధృవీకరించిందని గుర్తు చేశారు. దీనికితోడు 2007లో ముస్లిం మైనారిటీలలోని 15 తరగతులను బీసీ-ఇ గ్రూపుగా గుర్తించడం, మరో 26 బీసీ కులాలు బీసీ జాబితాలో చేర్చడంతో అదనంగా 15 శాతంమంది బీసీ జాబితాలో చేర్చబడ్డారని గుర్తు చేశారు. ఈ మొత్తాన్ని కలిపిచూస్తే రాష్ర్టంలోని బీసీ జనాభా 64 శాతానికి చేరిందని ఆయన వివరంగా పేర్కొన్నారు.
దీనికితోడు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి 50శాతానికి పైగా రిజర్వేషన్లు కల్పించే విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. కర్ణాటక ప్రభుత్వ ఇంద్రసహానీ కేసును ఉదాహరణగా పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణలు 15,16 కు 2005లో చట్ట సవరణలు చేసిన అంశాన్ని గుర్తు చేశారు. ఈ సవరణల ఫలితంగా అధికారిక గణాంకాలు ఉంటే 50శాతానికి మించి రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని వివరిస్తూ ఈ కోర్టు వ్యాజ్యా నికి సంబంధించిన పత్రాలను బిసి కమీషన్‌కు సమర్పించారు. ఫలితంగా బీసీ కమిషన్‌ మరో మారు బహిరంగ విచారణకు ఆదేశించింది. ఈ బహిరంగ విచారణ సక్రమంగా పూర్తయితే బీసీ రిజర్వేషన్ల పెంపుకు మార్గం సుగమం కాగలదు.

source:-file:///C:/Documents%20and%20Settings/Admin/My%20Documents/Downloads/Suryaa%20Telugu%20Daily%20%20%20kapu.htm

--
regards,
sagar kadavakollu.

No comments:

Post a Comment